పెద్దిరెడ్డి ప్రచారంపై నిషేధం విధించాలి

ప్రధానాంశాలు

పెద్దిరెడ్డి ప్రచారంపై నిషేధం విధించాలి

కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం ఫిర్యాదు చేశారు. కడప జిల్లా కలసపాడు మండలం రాజుపాళెంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థకు చెందిన భవనం ఆవరణలో మంత్రి తన అనుచరులతో కలిసి వైకాపా అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై బద్వేలు భాజపా అభ్యర్థి సురేష్‌ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. అపహరణకు గురైన కడప జిల్లా కలసపాడు మండల భాజపా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డిని వెంటనే విడిపించాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కు సోమువీర్రాజు లేఖ రాశారు.రామకృష్ణారెడ్డిని వెంటనే ఎస్పీ లేదా డీఎస్పీ ద్వారా మీడియా ఎదుట హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

* రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలపై సామాజిక మాధ్యమాల ద్వారా భాజపా చేసిన ప్రచారానికి జాతీయ స్థాయిలో 5వ స్థానం లభించిందని పార్టీ రాష్ట్ర శాఖ తెలిపింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని