విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే హక్కుప్రభుత్వానికి ఎవరిచ్చారు?

ప్రధానాంశాలు

విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే హక్కుప్రభుత్వానికి ఎవరిచ్చారు?

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే హక్కు వైకాపా ప్రభుత్వానికి ఎవరిచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ వ్యవస్థను ప్రభుత్వం ఎందుకు నీరుగారుస్తోందని ప్రశ్నించారు. కొవిడ్‌తో విద్యాసంవత్సరం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న విద్యార్థులను విలీనం పేరిట మరింత ఒత్తిడికి గురిచేయటమేమిటి? అని నిలదీశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో  నంబరు 42 తక్షణమే రద్దు చేయాలని ఒక ప్రకటనలో డిమాండు చేశారు.

బడిలో ఉండాల్సిన వారిని జగన్‌ రోడ్డున పడేశారు

‘‘బడిలో ఉండాల్సిన విద్యార్థులను సీఎం జగన్‌ రోడ్డున పడేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు సహకారం నిలిపేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థుల పాలిట గొడ్డలిపెట్టు. వారి భవిష్యత్తును అంధాకరం చేస్తోంది. ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థుల చదువులు అర్థంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. లక్షల మంది విద్యార్థులు, సిబ్బంది జీవితాల్ని ఇబ్బందులకు గురిచేయడం మంచిదికాదు. ప్రభుత్వ నిర్ణయం వారందరి పాలిట శాపం. అమ్మఒడి ఎవరు అడిగారు? మా బడులు మాకు కావాలని విద్యార్థులు కోరుతున్నారు. వారి విన్నపాల్ని అర్థం చేసుకుని ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు, విద్యార్థులు పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం...’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని