close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రైతు కష్టం.. నీటి పాలు

 రూ.288 కోట్ల మేర నష్టం

ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే యంత్రాంగం: నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మంగళవారం సాయంత్రం వరకు సేకరించిన గణాంకాల ప్రకారం..తొమ్మిది జిల్లాల్లో 1,44,092 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టం విలువ సుమారు రూ.288కోట్ల వరకు ఉంటుంది. పంట నష్టం గణన పూర్తయ్యేనాటికి ఇది పెరిగే అవకాశముంది. కర్నూలుజిల్లాలో అత్యధికంగా 62వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 27వేలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 21వేలు, కర్నూలు జిల్లాలో 20వేల ఎకరాల వరకు వరినాట్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. కర్నూలు జిల్లాలో 27వేల ఎకరాలకు వరకు మొజొన్న, 12వేల ఎకరాల పత్తికి నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో 10వేల ఎకరాలకు పైగా పత్తి, 2వేల ఎకరాల వరకు మిరప, 2వేల ఎకరాల వరి దెబ్బతిన్నాయి. కడప, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోనూ పంటలకు నష్టం జరిగింది.

నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు
ఈశాన్య బంగాళాఖాతంలో  20న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. తెలంగాణ, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం బలహీనపడిందని వివరించారు. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరు వానలు, అక్కడక్కడా భారీవర్షాలు కురవొచ్చని తెలిపారు.

శ్రీశైలం నుంచి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 2,21,888 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 10 రేడియల్‌ క్రస్ట్‌గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,76,670 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 30,253 క్యూసెక్కులను నాగార్జునసాగô్కు విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆరింటికి నీటిమట్టం 884.40అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 212.4385టీఎంసీలుగా నమోదైంది.
సాగర్‌ 20 క్రస్టుగేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్‌ డ్యాం 20 క్రస్టుగేట్లు 14 అడుగులు ఎత్తి 3,40,344 క్యూసెక్కుల నీటిని దిగువకృష్ణాకు వదులుతున్నారు. సాగర్‌ కుడికాల్వకు 8375, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 1800, వరదకాలువకు 300, సాగర్‌ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 28,136 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 3,78,955 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
సోమశిల క్రస్ట్‌గేట్ల ఎత్తివేత
సోమశిల జలాశయానికి బుధవారం 80276 క్యూసెక్కులు వస్తుండగా పది గేట్లు ఎత్తి పెన్నానదిలోకి 30వేల క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం ఆరింటికి జలాశయంలోకి 72క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నిల్వ 73టీఎంసీలుగా ఉంది.
అనంత, కర్నూలులో పంట నష్టం
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలో 245 ఎకరాల్లో పత్తి, 182.5ఎకరాల్లో వేరుసెనగ, 100 ఎకరాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతింది. గోవిందవాడ, దర్గాహొన్నూరు గ్రామాల్లో వేరుసెనగ పంట నీట మునిగింది. కర్నూలు జిల్లాలో అనేకచోట్ల పంటలు నీటి మునిగాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.