close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫలితాలు తారుమారు చేశారు

విశాఖ కలెక్టరేట్‌ ఎదుట నిరసన

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో అక్రమాలు జరిగాయని, ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. తెదేపా మద్దతుదారు గండ్రెడ్డి రమేష్‌ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గ్రామస్థులు సోమవారం విశాఖ కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి మంత్రి ఒత్తిడికి తలొగ్గి వైకాపా మద్దతుదారుకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. మొత్తం 1329 ఓట్లలో తెదేపా మద్దతుదారుకు పడిన 22 ఓట్లు తిరస్కరించారని, మరో ఆరు ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ఆర్వో హడావిడిగా ఫలితాన్ని ప్రకటించి వెళ్లిపోయారన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణతో కలిసి రమేష్‌, గ్రామస్థులు కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు వినతిపత్రం అందజేశారు. పరిశీలిస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు