close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పోలవరం గేట్లకు హైడ్రాలిక్‌ సిలిండర్ల బిగింపు

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే గేట్ల నిర్వహణకు వీలుగా జర్మనీ నుంచి తెప్పించిన హైడ్రాలిక్‌ సిలిండర్ల బిగింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే స్పిల్‌ వే గడ్డర్ల నిర్మాణం పూర్తికాగా, తాజాగా ఈ పనులు చేపట్టారు. రేడియల్‌ గేట్లకు హైడ్రాలిక్‌ సిలిండర్లు అమర్చడం దేశంలో ఇదే మొదటిసారి అని ప్రాజెక్టు నిర్మిస్తున్న మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ పేర్కొంది. మొత్తం 48 గేట్లకు గానూ ఇంతవరకు 29 గేట్లు నిర్మించారు. వీటిలో ఒక దానికి సోమవారం హైడ్రాలిక్‌ సిలిండర్‌ అమర్చారు. మౌంట్‌ హైడ్రాలిక్‌ సంస్థ జర్మనీ నుంచి వీటిని తీసుకురాగా, ఆ సంస్థ ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు చేస్తున్నారు. ఒక్కో గేటుకు రెండు చొప్పున 48 గేట్లకు 96 సిలిండర్లు అమర్చాల్సి ఉంటుంది. ఒక్కో సిలిండర్‌ 20 మెట్రిక్‌ టన్నుల బరువు ఉంటుంది. వీటి వల్ల గేట్లను తెరిచేటప్పుడు, మూసేటప్పుడు.. నిమిషం వ్యవధిలోనే అర మీటరు దూరం కదల్చవచ్చు. గేట్ల నిర్వహణ కోసం నిర్మించిన పవర్‌ ప్యాక్‌ గదిని కూడా సోమవారం ప్రారంభించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు