ప్రైవేటు వ్యక్తులతో ‘సర్వర్లు’ తెరిపిస్తారా!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు వ్యక్తులతో ‘సర్వర్లు’ తెరిపిస్తారా!

ప్రశ్నించిన సంగం డెయిరీ ఉద్యోగులు

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వడ్లమూడి వద్దనున్న సంగం డెయిరీలో అనిశా అధికారులు, డెయిరీ ఉద్యోగుల మధ్య గురువారం సరికొత్త వివాదం రేగింది. డెయిరీ కీలక డేటా ఉండే సర్వర్లను ‘ఆపరేట్‌’ చేసేందుకు అనిశా అధికారులు ప్రైవేటు వ్యక్తులను తీసుకురావడంపై ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. తనిఖీలు నిర్వహించేందుకు తమకు అనుమతులున్నాయని అధికారులు చెప్పగా... ప్రైవేటు వ్యక్తులను సంస్థలోకి తీసుకురావడం ఏమిటని వారు ప్రశ్నించారు. అనంతరం సంస్థ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి వారు ఆందోళనకు దిగారు. ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రైవేటు వ్యక్తులను ఇలా సర్వర్లను తెరవడానికి ఉపయోగిస్తే డేటా చోరీ అయ్యే అవకాశాలున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు