ఈసారీ భక్తులు లేకుండానే జగన్నాథుని రథయాత్ర
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈసారీ భక్తులు లేకుండానే జగన్నాథుని రథయాత్ర

జులై 12న పూరీలో కర్ఫ్యూ

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాదీ భక్తులు లేకుండానే జరగనుంది. గతేడాది మాదిరిగా కొవిడ్‌ ఆంక్షల మధ్య సేవాయత్‌లు రథాలను లాగుతారు. ప్రత్యేక రిలీఫ్‌ కమిషనరు ప్రదీప్‌ కుమార్‌ జెనా గురువారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. జులై 12న పూరీలో కర్ఫ్యూ అమలవుతుందని చెప్పారు. రథయాత్రకు రెండ్రోజులు ముందు నుంచి రైళ్లు, బస్సులు పూరీలోకి రాకుండా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతేడాది సుప్రీంకోర్టు సూచనల మేరకు భక్తులు లేకుండా రథయాత్ర నిర్వహించామని, ఈ ఏడాదీ ఆంక్షలన్నీ యథాతథంగా అమలవుతాయని చెప్పారు. కొవిడ్‌ రెండు టీకాలు వేసుకున్నట్లుగానీ, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో కరోనా లేదనిగానీ ధ్రువపత్రాలు చూపిన సేవాయత్‌లే పూరీ రథయాత్రలో సేవలందించే అవకాశం ఉంటుందని వివరించారు. రాష్ట్రంలోని ఇతర జగన్నాథ ఆలయాల్లోనూ వేడుకలకు అనుమతించబోమని స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు