మతిస్థిమితం కోల్పోయిన వారి రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మతిస్థిమితం కోల్పోయిన వారి రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు?

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: మతిస్థిమితం కోల్పోయిన వారి విషయంలో మెంటల్‌హెల్త్‌ కేర్‌ (ఎంహెచ్‌సీ) చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను సమర్పించేందుకు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలనిచ్చింది. మతిస్థిమితం సక్రమంగా లేక రహదారుల వెంట తిరిగే వారిని మెంటల్‌హెల్త్‌ కేర్‌ చట్టం ప్రకారం ఆసుపత్రుల్లో చేర్పించాల్సిన బాధ్యత ఆయా ప్రాంతాల పరిధిలోని పోలీసులపై ఉందంటూ విశాఖపట్నం ప్రభుత్వ మానసిక ఆసుపత్రి సైకియాట్రీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామానంద్‌ సతాపతి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను పిల్‌గా పరిగణించి హైకోర్టు విచారించింది. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. చట్టం అమలు తీరుపై యూనిట్‌ ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరించి అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఆయన కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు