వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్‌

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ కేజీహెచ్‌లో వెంటిలేటర్‌పై ఉన్న కొవిడ్‌ సోకిన గర్భిణికి వైద్యులు విజయవంతంగా సిజేరియన్‌ నిర్వహించారు. నగరంలోని తామరచెర్లకు చెందిన గర్భిణి (26) కరోనా బారిన పడ్డారు. ఈ నెల 2న కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో చేరారు. ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 9 నెలల గర్భిణి కావడం, ఆరోగ్యస్థితి విషమంగా మారడంతో గురువారం ప్రసూతి విభాగ సహాయ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.కవిత ఆధ్వర్యంలో వైద్య బృందం సిజేరియన్‌ చేసింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణికి సిజేరియన్‌ ఇంతవరకు ఇక్కడ నిర్వహించలేదని, ఒక వైపు తల్లి ప్రాణాలు కాపాడుతూనే, ఇంకో వైపు బిడ్డకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశామని డాక్టర్‌ కవిత తెలిపారు. శస్త్ర చికిత్స తర్వాత తల్లి ఆరోగ్యస్థితి కాస్త మెరుగైందని చెప్పారు. మగబిడ్డ జన్మించాడని, శిశువుకు కొవిడ్‌ నెగిటివ్‌ వచ్చిందన్నారు. తల్లి మాత్రం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోందని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు