71 రోజుల్లో 8.86 లక్షల కేసులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

71 రోజుల్లో 8.86 లక్షల కేసులు

తొలి దశలో ఆ స్థాయి కేసులొచ్చేందుకు 312 రోజుల సమయం
24 గంటల్లో 8,110 మందికి కొవిడ్‌
67 మంది మృతి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కరోనా రెండో దశ విరుచుకుపడింది. తొలి దశలో 8,86,066 కేసులు నమోదయ్యేందుకు 312 రోజులు సమయం పట్టగా, మలి దశలో 71 రోజుల్లోనే 8,86,190 కేసులు వచ్చాయి. గతేడాది మార్చి 12న రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తీవ్రస్థాయికి చేరి ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరి 18నాటికి మొత్తం కేసుల సంఖ్య 8,86,066కు చేరింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. ఏప్రిల్‌నుంచి మలి దశ ఉద్ధృతి మొదలై మే నెలలో తీవ్ర స్థాయికి చేరింది. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్‌1 నుంచి జూన్‌10 (గురువారం) మధ్య 8,86,190 కేసులు వచ్చాయి. మరోవైపు 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 8,110 మంది కరోనా బారిన పడ్డారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య ఏపీలో 97,863 నమూనాలను పరీక్షించగా వారిలో 8.28 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరో 67 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 17,87,883కు, మరణాల సంఖ్య 11,763కు చేరాయి.
* కొత్తగా కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్యతో పోలిస్తే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటోంది. కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి. ఈ ప్రభావంతో క్రియాశీల కేసుల సంఖ్య బాగా తగ్గింది. ఒకానొక దశలో క్రియాశీల కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష లోపునకు (99,057)కు దిగి వచ్చింది.
* ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 2,01,37,627 నమూనాలను పరీక్షించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు