టాటా స్టీల్‌ పోటీల్లో ‘వీఐటీ’ విజేత
close

ప్రధానాంశాలు

టాటా స్టీల్‌ పోటీల్లో ‘వీఐటీ’ విజేత

చెన్నై(వడపళని), న్యూస్‌టుడే: యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికి తీసేందుకు టాటా స్టీల్‌ సంస్థ నిర్వహించిన పోటీల్లో వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(వీఐటీ) బృందం విజయం సాధించింది. త్రీడీ టైటానియం మిశ్రమంతో కూడిన ప్రింట్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టును వీఐటీ బృందం ప్రదర్శించి విజేతగా నిలిచింది. టాటా స్టీల్‌ అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ రీసెర్చి సెంటర్స్‌(టీఎస్‌ఏఎంఆర్సీ), క్యాంపస్‌ కనెక్ట్‌ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో ఈ నెల 9న ‘మెటీరియల్‌ ఎన్‌ఈఎక్స్‌టీ 2.0’ పేరిట తుది పోటీలు జరిగాయి. వీఐటీ బృందానికి సెంటర్‌ ఫర్‌ బయో మెటీరియల్స్‌, సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ థెరానోస్టిక్స్‌ (సీబీసీఎంటీ) విభాగ డైరెక్టరు, సీనియర్‌ ఆచార్యులు డాక్టర్‌ గీతా మణివాసగం సహకరించినట్లు పేర్కొన్నారు. పోటీల్లో విజేతగా నిలిచిన పెర్లిన్‌ హమీద్‌, అన్షీద్‌ రహీం, జి.అశ్విన్‌, ఆర్‌.జిశిత బృందానికి రూ.5 లక్షల నగదు బహుమతి లభించింది. 6 నెలలపాటు జరిగిన పోటీల్లో దేశవ్యాప్తంగా 250 బృందాలు పాల్గొన్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని