నేడు ఏలూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు

ప్రధానాంశాలు

నేడు ఏలూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చిన ఆమె స్థానిక సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, డీఐజీ మోహనరావు, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మలతో చర్చించి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ, జేసీ (రెవెన్యూ) వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని