ఐఏఎస్‌ అధికారి సత్యనారాయణ ఎన్బీడబ్ల్యూ రీకాల్‌ పిటిషన్‌ కొట్టివేత

ప్రధానాంశాలు

ఐఏఎస్‌ అధికారి సత్యనారాయణ ఎన్బీడబ్ల్యూ రీకాల్‌ పిటిషన్‌ కొట్టివేత

 సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్‌ చేసిన ధర్మాసనం

ఈనాడు, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణపై జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్బీడబ్ల్యూ)ను వెనక్కి తీసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. వారెంట్‌ రీకాల్‌ చేయాలంటే న్యాయస్థానం విధించే షరతుకు కట్టుబడి రూ.50వేలు ఏపీ న్యాయవాదుల గుమాస్తాల సంక్షేమనిధికి చెల్లించాలంది. అందుకు సత్యనారాయణ సానుకూలంగా స్పందించలేదు. దీంతో వారెంట్‌ రీకాల్‌ చేయాలంటూ సత్యనారాయణ దాఖలుచేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేస్తూ జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు. ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆ ఉత్తర్వులపై మధ్యాహ్నం ధర్మాసనం ముందు అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ లెటర్‌ పేటెంట్‌ అప్పీల్‌ (ఎల్‌పీఏ) దాఖలు చేశారు. దానిపై అప్పటికప్పుడు విచారణ జరిపిన జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును ఈ నెల 27 వరకు సస్పెండ్‌ చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని