ఇలాగైతే కొవిడ్‌ సేవలకు దూరమవుతాం

ప్రధానాంశాలు

ఇలాగైతే కొవిడ్‌ సేవలకు దూరమవుతాం

 ఐఎంఏ ఏపీ ముఖ్య నేతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 57 పాలనా సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కొవిడ్‌ సేవలకు దూరంగా ఉంటామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య నేతలు ఎన్‌.సుబ్రమణ్యం, సి.శ్రీనివాసరాజు వెల్లడించారు. ఉత్తర్వుల కారణంగా 80% వైద్యసేవలు అందించే చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులపై భారం మోపడంతో అవి మూతపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘పెద్ద ఆసుపత్రులతో పాటు చిన్న, మధ్య స్థాయివి ఆక్సిజన్‌ ప్లాంటు, 40-100 ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. రూ.కోట్ల ఖర్చుతో ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటుచేస్తే కరోనా తీవ్రత తగ్గాక అవి మూతపడే అవకాశముంది. రాష్ట్రంలో 7 వేల ప్రైవేటు ఆసుపత్రుల్లో క్రిటికల్‌ కేర్‌, ఆరోగ్యశ్రీ సేవలు, కొవిడ్‌ సేవలు అందించేందుకు 600 తప్పించి.. మిగతా ఆసుపత్రులు పాక్షికంగా మూతపడ్డాయి. ఇలాంటివాటిపై రూ.కోట్ల భారం వేయడం సబబు కాదు’ అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని