‘కంప్యూటర్‌ సైన్స్‌’లోనే 50 వేలకు పైగా సీట్లు

ప్రధానాంశాలు

‘కంప్యూటర్‌ సైన్స్‌’లోనే 50 వేలకు పైగా సీట్లు

 ఇంజినీరింగ్‌ కొత్తకోర్సులతో కలిపి ఈ బ్రాంచికే అత్యధికం కేటాయింపు

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌లో ఆరు కొత్త కోర్సులతో కలిపి కంప్యూటర్‌ సైన్సు(సీఎస్‌ఈ)లో 50వేలకుపైగా సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1,39,862 సీట్లకు అనుమతి లభించగా.. వీటిలో 36శాతం సీట్లు సీఎస్‌ఈలోనే ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపుతుండడంతో విద్యా సంస్థలు వీటి అనుమతులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐటీలో ఈసారి అత్యల్పంగా 4,590 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా సీఎస్‌ఈ, ఈసీఈలోనే అధికంగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కోర్సులను ఈ ఏడాది ప్రత్యేకంగా కాకుండా సీఎస్‌ఈలోనే చూపించారు. వీటిల్లో 17,790 సీట్లకు ఏఐసీటీఈ అనుమతించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని