నా ఆదేశాలకు కట్టుబడేలా ఈవోను నిర్దేశించండి

ప్రధానాంశాలు

నా ఆదేశాలకు కట్టుబడేలా ఈవోను నిర్దేశించండి

  హైకోర్టులో మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: పాలకవర్గం సమావేశం ఏర్పాటు నిమిత్తం మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యనిర్వహణాధికారి(ఈవో) ఈ ఏడాది జూన్‌ 9న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఆ ట్రస్ట్‌ ఛైర్మన్‌ పి.అశోక్‌గజపతిరాజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 3న జారీచేసిన జీవో 75 అమలును నిలుపుదల చేయాలని కోరారు. ఈవో తమ ఆదేశాలను అనుసరించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఈవో డి.వెంకటేశ్వరరావును వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు వద్దకు శనివారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ వ్యాజ్యం ఏ బెంచ్‌ వద్దకు విచారణకు వెళ్లాలో నిర్ణయం తీసుకునే నిమిత్తం కేసు ఫైలును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి ముందు ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని రిజీస్ట్రీని ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని