ఇంటి నిర్మాణ ఖర్చు రూ.1.80 లక్షలకు మించదు

ప్రధానాంశాలు

ఇంటి నిర్మాణ ఖర్చు రూ.1.80 లక్షలకు మించదు

గృహనిర్మాణ మంత్రి శ్రీరంగనాథరాజు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలకు మించి ఖర్చు కాదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. సామగ్రికి రూ.1.20 లక్షలు, కూలీకి రూ.60 వేలు ఖర్చవుతుందని ముందుగానే అంచనా వేసి ఆ ప్రకారమే యూనిట్‌ విలువ నిర్ణయించామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఖర్చవుతుందనటం సరికాదని పేర్కొన్నారు. ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  సిద్ధాంతం, కొవ్వూరు ప్రాంతాలనుంచి ఏలూరుకు లారీ ఇసుక తేవాలంటేనే రూ.25వేల వరకూ ఖర్చవుతోందని.. ప్రకాశం వంటి జిల్లాలకు లారీ ఇసుక పంపించాలంటే రవాణాకే రూ.50 వేలు అవుతుందని వివరించారు. అయినప్పటికీ లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. సిమెంటు తక్కువ ధరకే అందిస్తున్నామని వివరించారు. ‘రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వారిలో 15.60 లక్షల మందికి తొలి విడతలో ఇళ్లు మంజూరు చేశాం. 3.80 లక్షల మంది లబ్ధిదారులు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలంటూ మూడో ఆప్షన్‌ ఎంచుకున్నారు. వారి కోసం మండలాధికారుల పర్యవేక్షణలో ప్రతి 20 ఇళ్లకు ఒక అధికారిని, మేస్త్రీని ఏర్పాటుచేశాం. మిగతా వారు పెద్ద ఇళ్లు నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో ఒకటి, రెండు ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారు. మొత్తంగా పేదలకు రూ.4 లక్షల కోట్ల విలువైన ఆస్తిని సమకూర్చాం. ఒక ఇల్లు నిర్మిస్తే వివిధ విభాగాలకు చెందిన 140 మందికి ఉపాధి లభిస్తుంది. కరోనాతో మందగించిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఈ గృహనిర్మాణం దోహదపడుతుంది’ అని శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని