ఉన్నత విద్యలో పరిశోధనలు పెరగాలి

ప్రధానాంశాలు

ఉన్నత విద్యలో పరిశోధనలు పెరగాలి

ఎన్‌ఈపీ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు నాణ్యమైన పరిశోధనలు, సమ్మిళిత విద్యపై దృష్టి సారించాలని జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 ముసాయిదా కమిటీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ సూచించారు. ఏపీఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం శనివారం ‘21వ శతాబ్దంలో శక్తిమంతమైన సమాజ నిర్మాణం’ అంశంపై నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో మాట్లాడారు. జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని, పరిశ్రమలకు అవసరమయ్యే విభాగాల్లో పరిశోధనలకు ఇది సహకరిస్తుందన్నారు. కృత్రిమ మేథ, త్రీడీ టెక్నాలజీ, మెషిన్‌ లెర్నింగ్‌లాంటి కోర్సులను ప్రోత్సహించాలని.. తరగతి గదిలో అత్యంత నాణ్యమైన విద్యాబోధన అందుబాటులో ఉండాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు, విద్యారంగంలో అమలు చేస్తున్న విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను వివరించారు. విద్యారంగం పురోభివృద్ధికి ఏపీ చేపడుతున్న సంస్కరణలను కస్తూరి రంగన్‌ ప్రశంసించారు. సమావేశంలో ఎస్‌ఆర్‌ఎం ఉపకులపతి వీఎస్‌రావు, ప్రో వైస్‌ఛాన్సలర్‌ నారాయణరావు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని