అట్టడుగు వర్గాలకు సాధికారత దిశగా సీఎం అడుగులు

ప్రధానాంశాలు

అట్టడుగు వర్గాలకు సాధికారత దిశగా సీఎం అడుగులు

సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘చాలామంది కుల సంఘాల నేతలు వారికి పదవులు కావాలని మా వద్దకు వస్తుంటారు. దానికంటే ముందు వారు వారి జాతి ప్రాథమిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలి’అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల్లో ప్రజాసేవకులుగా పేరుతెచ్చుకునేవారిని నాయకులుగా ముఖ్యమంత్రి జగన్‌ తీర్చిదిద్దుతారని తెలిపారు. శనివారం వైకాపా కేంద్ర కార్యాలయంలో చాత్తాద శ్రీవైష్ణవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మనోజ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఆ సామాజికవర్గ ప్రతినిధుల సమావేశంలో సజ్జల పాల్గొని ప్రసంగించారు. ‘అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. 56బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటుతోనే మొత్తం అయిపోయిందా? అంటూ తెదేపా వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ ఏమీ అయిపోలేదు, ఆయా కులాల సమస్యలకు పరిష్కారమనేది ఇప్పుడే మొదలైంది’అని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని