పేద విద్యార్థినులకు తానా తోడ్పాటు

ప్రధానాంశాలు

పేద విద్యార్థినులకు తానా తోడ్పాటు

గుంటూరు, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థినులకు తానా తోడ్పాటు అందించింది. ఇందులో భాగంగా గుంటూరులోని కమ్మ విద్యార్థినుల వసతిగృహంలోని విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనూరాధ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి, ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ తుమ్మల రమాదేవి, కమ్మ జన సేవా సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు 23 మంది విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. అనూరాధ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నందున ల్యాప్‌టాప్‌ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీతామహాలక్ష్మి మాట్లాడుతూ అవసరమైన విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రమాదేవి మాట్లాడుతూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రమశిక్షణతో మెలుగుతూ చదువుకొని నలుగురికి సహాయం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ రెండో విడతగా మరికొందరు విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. సమితి గౌరవ సలహాదారు గోరంట్ల పున్నయ్య చౌదరి, గౌరవ అధ్యక్షుడు వంకాయలపాటి బలరామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని