రాష్ట్ర వ్యాజ్య విధానాన్ని సమర్థంగా అమలుచేయాలి: సీఎస్‌

ప్రధానాంశాలు

రాష్ట్ర వ్యాజ్య విధానాన్ని సమర్థంగా అమలుచేయాలి: సీఎస్‌

ఈనాడు, అమరావతి: నూతనంగా తీసుకురానున్న రాష్ట్ర వ్యాజ్య (లిటిగేషన్‌) విధానాన్ని సమర్థంగా అమలుచేస్తే కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌దాస్‌ వెల్లడించారు. సచివాలయంలో వ్యాజ్యాల అంశంపై న్యాయ అధికారులు, కార్యదర్శులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాజ్య విధానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పకడ్బందీగా అమలుచేస్తే కేసుల వివరాలు ప్రభుత్వ న్యాయవాదులు, అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయని ఆయన అన్నారు. సకాలంలో ఆయా కేసుల్లో కౌంటర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ విధానాన్ని సమన్వయంతో నిర్దుష్ట కాలవ్యవధితో నిర్వహిస్తే కోర్టులపై ప్రభుత్వ వ్యాజ్యాల భారాన్ని తగ్గించవచ్చని సూచించారు. ఏపీ ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ప్రవేశపెట్టనున్నామని.. దీంతో జిల్లా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులకు సంబంధించిన వివిధ వ్యాజ్యాల సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని