త్వరలో పీఆర్‌సీ ప్రకటన

ప్రధానాంశాలు

త్వరలో పీఆర్‌సీ ప్రకటన

సీఎం జగన్‌ హామీ ఇచ్చారన్న ఏపీఎన్జీవో సంఘం నేతల వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే వేతన సవరణ ప్రకటిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి తెలిపారు. సీపీఎస్‌ రద్దుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించి ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారని వివరించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరామని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు లేకుండా అక్టోబరు 2న ప్రొబేషన్‌ ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీఎన్జీవో సంఘం నేతలు ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందించారు. 11వ పీఆర్‌సీని 55శాతం ఫిట్‌మెంట్‌తో 2018 జులై 1 నుంచి అమలు చేయాలని కోరామన్నారు.

అక్టోబరు 2న సత్యాగ్రహ దీక్ష

రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పదవీ విరమణ పొందిన సీపీఎస్‌ ఉద్యోగులతో అక్టోబరు 2న విజయవాడలో ‘సత్యాగ్రహ దీక్ష’ నిర్వహిస్తామని ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎం దాస్‌, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని