పీవోల నియామకంపై సీజే నిర్ణయం తీసుకుంటారు

ప్రధానాంశాలు

పీవోల నియామకంపై సీజే నిర్ణయం తీసుకుంటారు

స్పష్టం చేసిన హైకోర్టు  ప్రభుత్వ వాదన తోసివేత

ఈనాడు, అమరావతి: తిరుపతి, విజయవాడ భూసేకరణ అథార్టీలకు ప్రిసైడింగ్‌ అధికారుల (పీవో) పేర్ల పునఃపరిశీలన వ్యవహారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) వద్ద ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో సీజే పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. గతంలో ప్రతిపాదించిన పేర్లను సీజే మళ్లీ చెబితే వారినే పీవోలుగా నియమిస్తామని ఏజీ చెప్పిన విషయాన్ని నమోదుచేసింది. ఈ విషయంలో పురోగతి తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్‌ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. బయోడేటా పరిశీలించకుండా పేర్లను గతంలో సీజే సిఫారసు చేశారన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. న్యాయాధికారుల రికార్డులు హైకోర్టు వద్ద ఉంటాయని గుర్తుచేసింది. బయోడేటాను పరిశీలించాకే అప్పటి సీజే ప్రభుత్వానికి సిఫారసు చేశారని తెలిపింది. పీవోల నియామకంలో జాప్యాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లికార్జునరావు హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని