దూరదర్శన్‌ ఏటీటీఎస్‌ల మూసివేతకు ఉత్తర్వులు

ప్రధానాంశాలు

దూరదర్శన్‌ ఏటీటీఎస్‌ల మూసివేతకు ఉత్తర్వులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ఉన్న 152 దూరదర్శన్‌ అనలాగ్‌ టెరస్ట్రియల్‌ ట్రాన్స్‌మిటర్‌ (ఏటీటీఎస్‌) కేంద్రాలను అక్టోబరు31లోగా మూసివేయనున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రసారభారతి కేంద్రం నుంచి ఆయా కేంద్రాలకు ఉత్తర్వులు వచ్చాయి. హైపవర్‌ ట్రాన్స్‌మిటర్‌ కేంద్రాలైన ఇవి ఏపీలో కర్నూలు, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, విజయవాడల్లో ఉన్నాయి. తెలంగాణలో బాన్సువాడ, కామారెడ్డి, దేవరకొండ, సిర్పూర్‌, వరంగల్‌లలో ఉన్నాయి. ఇవి మూతపడనున్నాయి. కర్ణాటకలో 15, తమిళనాడు 9, కేరళ 5, పుదుచ్చేరిలో ఒక కేంద్రం చొప్పున కూడా మూసివేత జాబితాలో ఉన్నాయి. దూరదర్శన్‌ ప్రసారాల డిజిటలీకరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపగ్రహాల ద్వారా ప్రసారాల్లో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పవర్‌ ట్రాన్స్‌మిటర్‌ కేంద్రాలను మూసేశారు. రెండో విడతలో హైపవర్‌ ట్రాన్స్‌మిటర్‌ కేంద్రాలను మూసేస్తున్నారు. ప్రైవేటురంగం నుంచి పోటీ వల్ల దూరదర్శన్‌కు వీక్షకుల ఆదరణ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని