ఈ-సంజీవని వినియోగంలో తొలిస్థానంలో ఏపీ

ప్రధానాంశాలు

ఈ-సంజీవని వినియోగంలో తొలిస్థానంలో ఏపీ

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన జాతీయ టెలీమెడిసిన్‌ సేవ.. ఈ-సంజీవని 1.20 కోట్ల సంప్రదింపులు (డాక్టర్‌ కన్సల్టేషన్లు) పూర్తి చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. ఈ సేవలను విరివిగా వినియోగించుకుంటున్న తొలి పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. ఈ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా రోజుకు 90,000 మంది ప్రజలు వైద్యులు, ప్రత్యేక నిపుణుల సేవలు పొందుతున్నారు. ‘‘భారత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన జాతీయ టెలీమెడిసిన్‌ సేవ.. ఈ-సంజీవని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్యనున్న డిజిటల్‌ ఆరోగ్య విభజనను చెరిపివేస్తోంది’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ తన ప్రకటనలో వివరించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని