పింఛను పంపిణీ వివరాలు ఆన్‌లైన్‌లో..

ప్రధానాంశాలు

పింఛను పంపిణీ వివరాలు ఆన్‌లైన్‌లో..

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్సార్‌ పింఛను కానుక కింద లబ్ధిదారులకు ఇస్తున్న పింఛను వివరాలను ప్రభుత్వం పోర్టల్‌లో అందుబాటులోకి తిరిగి తెచ్చింది. ఇటీవల వివిధ కారణాలతో ప్రభుత్వం పింఛన్లను నిలిపివేయడంపై క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైనందున పింఛను పంపిణీ వివరాలు సెప్టెంబరునుంచి ఆన్‌లైన్‌లో కనిపించకుండా తొలగించారు. కేవలం అధికారులు మాత్రమే లాగిన్‌ అయి చూసేలా మార్పులు చేశారు. దీనిపై ‘పింఛను పంపిణీ వివరాలు గోప్యం’ అని ‘ఈనాడు’లో ఈనెల8న కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు పింఛను వివరాలు అందరికీ కనిపించేలా ఆన్‌లైన్‌లో ఉంచారు. 

సెప్టెంబరు నెల పింఛనుకు 1.20 లక్షల మంది దూరం

వైఎస్సార్‌ పింఛను కానుక పోర్టల్‌లో ఉన్న వివరాలను పరిశీలిస్తే.. సెప్టెంబరులో 1.20 లక్షల మంది పింఛను తీసుకోలేదు. వీరిలో కొందరు మరణించినా.. పింఛను తీసుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఏ నెలకు ఆ నెలనే పింఛను తీసుకోవాలనే నిబంధనను ప్రభుత్వం అమల్లోకి తెచ్చినందున వీరందరికీ ఒక నెల పింఛను సాయం అందదు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని