అమెరికా కాన్సుల్‌ జనరల్‌ అరకు విహారం

ప్రధానాంశాలు

అమెరికా కాన్సుల్‌ జనరల్‌ అరకు విహారం

విశాఖ తీరం బాగుందంటూ కితాబు

ఈనాడు, విశాఖపట్నం: హైదరాబాద్‌ రీజియన్‌ అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మన్‌ అరకులో విహరించారు. తన జీవన భాగస్వామి (గే) పెర్రీ మిల్టన్‌తో కలసి సోమవారం విశాఖ వచ్చిన ఆయన  మంగళవారం ఉదయం అద్దాల బోగీలున్న రైల్లో అరకు వెళ్లారు. ఈ రైల్లో ప్రయాణిస్తూ కొండలు, లోయల అందాలను ఆస్వాదించినట్లు చెప్పారు. అరకు గిరిజన మ్యూజియం చూసిన తరువాత గిరిజన చరిత్ర, వారి జీవన విధానంపై మరింత అవగాహన కలిగిందన్నారు. గిరిజనుల గురించి తెలుసుకోవడానికి అరకు లోయ అద్భుత ప్రాంతమని కొనియాడారు. విశాఖలోని తీరప్రాంతం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. నగరంలోని హోటల్‌ నుంచి బంగాళాఖాతం కనిపించేలా దిగిన ఫొటోలను, రైలులో మిల్టన్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోలను, అరకు గిరిజన మ్యూజియంలో ఫొటోలను జోయెల్‌ రీఫ్‌మన్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు. వీరిద్దరూ రెండు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని