‘గిరి’ చేనేతలకు జాతీయ అవార్డులు

ప్రధానాంశాలు

‘గిరి’ చేనేతలకు జాతీయ అవార్డులు

వెంకటగిరి, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి చేనేతలకు మరోసారి జాతీయ పురస్కారాలు దక్కాయి. 2018, 2019 సంవత్సరాలకుగాను కేంద్ర ప్రభుత్వం చేనేత జౌళి శాఖ అవార్డులను ప్రకటించింది. వీటిల్లో వెంకటగిరికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత కూనా మల్లికార్జున్‌ 2018 సంవత్సరానికి సంబంధించి సంత్‌ కబీర్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. అదే ఏడాదికిగాను పట్నం శేఖర్‌కు జాతీయ మెరిట్‌ అవార్డు ప్రకటించింది. ఇతను ద్రౌపదీ స్వయం వరం, మత్స్య ఛేదనాన్ని చేనేత వాల్‌ హ్యంగ్‌లో నేశారు. ఈ కళను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసింది. 2019కి పట్నం సుబ్రమణ్యంకు జాతీయ మెరిట్‌ అవార్డును ప్రకటించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని