మరో 15 ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్లు

ప్రధానాంశాలు

మరో 15 ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్లు

పర్యాటకులకు మరిన్ని వసతులు: మంత్రి ముత్తంశెట్టి

ఈనాడు, విశాఖపట్నం: నూతన పర్యాటక విధానంలో భాగంగా రాష్ట్రంలోని 15 ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్య విధానంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఒబెరాయ్‌ సంస్థతో విశాఖపట్నం, తిరుపతిలో రూ.500 కోట్ల పెట్టుబడితో హోటళ్ల ఏర్పాటుకు చర్చలు జరిగాయన్నారు. మిగిలిన చోట్ల వీటిని నిర్మించేందుకు పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతామన్నారు. ఈ నెల 27 ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని