బైక్‌పై భారత యాత్ర!

ప్రధానాంశాలు

బైక్‌పై భారత యాత్ర!

బైక్‌పై హుందాగా కూర్చున్న యువతి మహారాష్ట్రలోని కొల్లాపురకు చెందిన గాయత్రి పటేల్‌. ఒంటరిగా దేశ పర్యటన చేస్తున్నారు. 2020 డిసెంబరు 5న స్వస్థలం నుంచి ద్విచక్రవాహనంపై బయల్దేరి ఇప్పటివరకు సుమారు 33 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. గురు, శుక్రవారాల్లో హంపీలో కలియ దిరిగారు. స్థానిక కమలాపుర పటేల్‌ సమాజం ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ..ఈ నెల 27న తిరిగి కొల్లాపుర చేరుకోవడంతో పర్యటన ముగుస్తుందని, ముంబయిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్నట్లు వివరించారు. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదన్నారు. పర్యటనలతో విజ్ఞాన సముపార్జన సాధ్యమవుతుందన్నారు.

- న్యూస్‌టుడే, హొసపేటె

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని