జస్టిస్‌ ఉమాదేవికి హైకోర్టు ఘనంగా వీడ్కోలు

ప్రధానాంశాలు

జస్టిస్‌ ఉమాదేవికి హైకోర్టు ఘనంగా వీడ్కోలు

 న్యాయసేవలను కొనియాడిన సీజే

ఈనాడు, అమరావతి: న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవికి హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉమాదేవి పదవీ కాలం శనివారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ఏకే గోస్వామి అధ్యక్షతన హైకోర్టులో శుక్రవారం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి మాట్లాడుతూ జస్టిస్‌ ఉమాదేవి న్యాయమూర్తిగా అందించిన సేవలు అందరికీ ఆదర్శమని కొనియాడారు. సుమారు రెండున్నర దశాబ్దాలకుపైగా న్యాయవ్యవస్థకు సేవలు అందించారని గుర్తు చేశారు. జస్టిస్‌ ఉమాదేవి మాట్లాడుతూ కుటుంబ సభ్యులు అందించిన తోడ్పాటుతోనే ఈ స్థాయికి చేరానన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, సహాయ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌ జస్టిస్‌ ఉమాదేవి అందించిన సేవలను గుర్తుచేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని