పర్వతారోహకుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 లక్షల సాయం

ప్రధానాంశాలు

పర్వతారోహకుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 లక్షల సాయం

ఈనాడు, అమరావతి: తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు తుకారాంకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.35 లక్షల ఆర్థిక సాయం అందించింది. గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. శుక్రవారం ఆర్థికసాయానికి సంబంధించిన చెక్కును ప్రభుత్వాధికారులు ఆయనకు అందజేశారు. రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు. భవిష్యత్తులో కూడా సాయం అందిస్తానంటూ సీఎం తనకు హామీ ఇచ్చారని తుకారం తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని