మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కన్నుమూత

ప్రధానాంశాలు

మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కన్నుమూత

మాచర్ల, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి(84) శుక్రవారం తెల్లవారుజామున ఆయన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. 2004లో మాచర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని భావించినా.. సోదరుని కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పార్టీ సీటు కేటాయించింది. 2014 ఎన్నికల సందర్భంగా లక్ష్మారెడ్డి తెదేపాలో చేరారు. ఆయన స్వగ్రామం వెల్దుర్తి మండలం కండ్లకుంట. లక్ష్మారెడ్డి మృతిపై తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన కుందూరు జానారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తదితరులు పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని