ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాల మార్పుపై భేటీ

ప్రధానాంశాలు

ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాల మార్పుపై భేటీ

ఈనాడు, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి పాఠ్యపుస్తకాలను మార్పు చేస్తున్నందున ఈనెల 21న ప్రాథమిక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో పుస్తక రచయితలు, ఎడిటర్లు, సాంకేతిక సమన్వయకర్తలు, సబ్జెక్టు సమన్వయకర్తలతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. 2019-20లో 1-6వ తరగతి, 2020-21లో ఏడో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను మార్పు చేశారు. పాఠ్యప్రణాళిక మార్పునకు అకడమిక్‌ సలహా మండలిని ఏర్పాటుచేశారు. పుస్తక రచయితలుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా 266మంది ముందుకు వచ్చారు. 11మంది డ్రాయింగ్‌, ఆర్ట్‌వర్క్‌కు పేర్లు నమోదు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి 118మందిని ఎస్‌సీఈఆర్టీ ఎంపిక చేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని