నేలటూరు థర్మల్‌ విద్యుత్తు ప్లాంటులో సాంకేతిక సమస్య

ప్రధానాంశాలు

నేలటూరు థర్మల్‌ విద్యుత్తు ప్లాంటులో సాంకేతిక సమస్య

ముత్తుకూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్తు కేంద్రం రెండో యూనిట్‌ను సాంకేతిక కారణాలతో శుక్రవారం నిలిపివేశారు. అందులో బాయిలర్‌ ట్యూబ్‌ లీకవుతుండటంతో అధికారులు విద్యుత్తు ఉత్పత్తిని ఆపేశారు. మరమ్మతుల అనంతరం రెండు, మూడు రోజుల్లో పునరుద్ధరిస్తామన్నారు. మొదటి యూనిట్‌లో 403 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. ప్రస్తుతం ప్లాంటులో 63 వేల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నట్లు స్థానిక ఇంజినీర్లు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని