తానా ‘పుస్తక మహోద్యమం’

ప్రధానాంశాలు

తానా ‘పుస్తక మహోద్యమం’

ఈనాడు, అమరావతి: బంధుమిత్రులు, పిల్లలకు పుస్తకాలను బహుమతిగా అందించే అక్షరాల పండగే ‘‘పుస్తక మహోద్యమం’’ అని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పుస్తక మహోద్యమాన్ని అమెరికాలోని అట్లాంటాలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా కొందరు స్నేహితులకు పలు పుస్తకాల్ని బహుమతిగా అందించారు. డాలస్‌ నగరంలోనూ ఈ కార్యక్రమాన్ని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు డా.తోటకూర ప్రసాద్‌ ప్రారంభించారు. అందులో భాగంగా ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన శ్రీ నైమిశ వెంకటేశ శతకం పుస్తకాన్ని ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం పాతికవేల పుస్తకాల్ని పాఠకుల చేతుల్లోకి తీసుకెళ్లటమే తమ లక్ష్యమన్నారు. భద్రాచలంలో జరిగిన కార్యక్రమంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ పుస్తక మహోద్యమానికి అనేక సాహితీ సంస్థలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, రచయితలు, పాఠకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. రాబోయే సంక్రాంతి పండగ వరకు దీన్ని ఒక ఉద్యమంగా కొనసాగిస్తామన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని