25, 26 తేదీల్లో కేఆర్‌ఎంబీ బృందం పర్యటన

ప్రధానాంశాలు

25, 26 తేదీల్లో కేఆర్‌ఎంబీ బృందం పర్యటన

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) రెండు రోజుల కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. బృంద సభ్యులు 25న మధ్యాహ్నం కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, మల్యాల, పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌ఎంసీ ప్రధాన కాల్వను పరిశీలిస్తారు. తర్వాత శ్రీశైలం చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. 26న శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, విద్యుదుత్పత్తి కేంద్రాలు, కార్యాలయ పరిసరాలు, క్యాంపు కాలనీలను తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడే అధికారులతో సమావేశమవుతారు. కేఆర్‌ఎంబీ బృందంలో రాష్ట్రానికి కేటాయించిన ఇరువురు సీఈలతోపాటు అంతర్రాష్ట్ర సీఈ శ్రీనివాసరెడ్డి, మరో ఇద్దరు సీఈలు ఉంటారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని