కొఠియాలో ఒడిశా బలగాల మోహరింపు

ప్రధానాంశాలు

కొఠియాలో ఒడిశా బలగాల మోహరింపు

సాలూరు గ్రామీణం, సిమిలిగుడ, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా సాలూరు మండలం, ఒడిశా సరిహద్దులోని కొఠియా వివాదాస్పద గ్రామాల్లో మరోసారి ఒడిశా పోలీసులు మోహరించారు. ఆయా గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి బోర్డులను ఏర్పాటు చేయాలని పార్వతీపురం ఐటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ బోర్డులను ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర అధికారులు శుక్రవారం వస్తారని ముందస్తు సమాచారం రావడంతో కొఠియా, ఎగువశెంబి, పగులుచెన్నూరు, పట్టుచెన్నూరులో ఒడిశా పోలీసులు మోహరించారు. బోర్డుల ఏర్పాటుకు ఎవరూ వెళ్లనప్పటికీ, ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు వెళ్లిన వైఎస్సార్‌ క్రాంతిపథం అధికారులు, కంటి వెలుగులో భాగంగా పరీక్షలు చేసేందుకు వెళ్లిన తోణాం పీహెచ్‌సీ వైద్యాధికారులను సరిహద్దు నుంచే వెనక్కి పంపించేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని