కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించారు?

ప్రధానాంశాలు

కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించారు?

‘కాకినాడ మేయర్‌ అవిశ్వాసం’పై 25న కలెక్టర్‌ హాజరుకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: కాకినాడ మేయర్‌ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానం, తదనంతరం తొలగింపు విషయంలో ఈనెల 25న కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని తూర్పుగోదావరి కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అవిశ్వాస తీర్మాన ఫలితం తామిచ్చే తీర్పునకు లోబడి ఉంటుందని ఆదేశించినా... ఫలితాన్ని కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపండంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించారో చెప్పాలని న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ శుక్రవారం ఆదేశించారు. తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని సవాలు చేస్తూ మేయర్‌ పావని హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన న్యాయమూర్తి... అవిశ్వాస తీర్మానంపై ఈనెల 5న జరగనున్న సమావేశ ఫలితం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. అయితే... తీర్మాన ఫలితాన్ని కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపడంతో మేయర్‌ పదవి నుంచి పావనిని తొలగిస్తూ సర్కారు జీవో, గెజిట్‌ ప్రకటన జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ ఆమె తాజాగా హైకోర్టులో మరో వ్యాజ్యం వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా... మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు అనుబంధ పిటిషన్‌ వేస్తామని కోర్టుకు తెలిపి... ఆ ప్రక్రియ పూర్తికాకముందే ఫలితాన్ని ప్రభుత్వానికి ఎలా పంపుతారని న్యాయమూర్తి ప్రశ్నించారు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని