పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా సృజన

ప్రధానాంశాలు

పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా సృజన


ఈనాడు, అమరావతి: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌ గుమ్మళ్ల సృజన బదిలీ అయ్యారు. ఆమెను పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌గా (రైతు భరోసా, రెవెన్యూ) ఉన్న జి.లక్ష్మీశను జీవీఎంసీ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా ఉన్న జె.వి.ఎస్‌.సుబ్రహ్మణ్యంని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ఛైర్మన్‌, ఎండీగా బదిలీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ (గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి)గా పనిచేస్తున్న కీర్తి చేకూరికి... జేసీ (రైతు భరోసా, రెవెన్యూ) పోస్టుని పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని