పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు

ప్రధానాంశాలు

పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం

విజయవాడ, న్యూస్‌టుడే: తెదేపా కేంద్ర కార్యాలయంలో 36 గంటల దీక్షలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పోలీసులు యూనిఫాం తీసేసి మీ చొక్కాలు మాకివ్వండి. ఇక నుంచి మేమే కేసులు దర్యాప్తు చేస్తామని’ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఐపై వైకాపా కార్యకర్త చేయి చేసుకున్న ఘటనను ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్‌ఖాన్‌ మాట్లాడుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్ని, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గౌరవాధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. సంఘం గౌరవ సలహాదారుడు వై.శ్రీహరి, ఉపాధ్యక్షురాలు లావణ్య, సభ్యులు ఆర్‌.రఘురామ్‌, టి.పెద్దయ్య, బండారు రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని