అధ్యక్షుడి కేబినెట్‌ ఎలా?

ప్రధానాంశాలు

అధ్యక్షుడి కేబినెట్‌ ఎలా?

అమెరికా కేబినెట్‌ను అధ్యక్షుడు స్వయంగా నియమించుకుంటారు. ఆ నియామకాలను సెనెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. కేబినెట్‌లో ప్రధానంగా మొత్తం పదిహేను మంది ఉంటారు. ఇవి కాకుండా శ్వేతసౌధంలో వివిధ విభాగాలకు మరికొందరుంటారు. అమెరికా అధ్యక్షుడు మొత్తం నాలుగు రకాల పదవులకు దాదాపు 4వేల నియామకాలు చేస్తారు.
1. సెనెట్‌ ఆమోదంతో చేసేవి
2. సెనెట్‌ అవసరం లేకుండా చేసేవి
3. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ సర్వీసెస్‌
4. షెడ్యూల్‌ సి (రాజకీయ) నియామకాలు

*వీరిలో ప్రధాన కేబినెట్‌లో 15 మంది మాత్రమే ఉంటారు. వీరిని ఆయా శాఖలకు సెక్రటరీగా పరిగణిస్తారు. వీరు ఆయా శాఖలకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లలా వ్యవహరిస్తూ... పాలనలో అధ్యక్షుడికి సాయం చేస్తారు. న్యాయ శాఖను నిర్వహించే వారిని మాత్రం అటార్నీ జనరల్‌గా పిలుస్తారు. ఈ కేబినెట్‌ సభ్యులంతా పూర్తిగా అధ్యక్షుడి ఇష్టమున్నన్ని రోజులే పదవిలో ఉంటారు. ఏ క్షణమైనా వారిని మార్చే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.
* కేబినెట్‌ కార్యదర్శులు చూసే ప్రధాన శాఖలు- వ్యవసాయం, వాణిజ్యం, రక్షణ, విద్య, ఇంధనం, ఆరోగ్యం-మావన సేవలు, అంతర్గత శాంతిభద్రతలు, గృహ-పట్టణాభివృద్ధి, కార్మిక, రవాణా, ఆర్థికం, వృద్ధుల వ్యవహరాలు...
* అమెరికాలో జన్మించని వారు (పుట్టుకతో అమెరికా పౌరులు కానివారు) కూడా కేబినెట్‌లో బాధ్యతలు చేపట్టొచ్చు. కాకుంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి గైర్హాజరీలో వారి బాధ్యతలు చేపట్టే అర్హత ఇలాంటివారికుండదు.
*అమెరికా రాజ్యాంగంలో కేబినెట్‌ను నిర్దిష్టంగా నిర్వచించలేదు. అధ్యక్షుడి విచక్షణాధికారం మేరకు ఎంతమందినైనా నియమించుకోవచ్చు. సెనెట్‌ ఆమోదం పొందాలంతే.
* వీరిని కాకుండా ఫెడెరల్‌ న్యాయమూర్తులు, రాయబారులు, ఇతర ఉన్నతాధికారులను సెనెట్‌ ఆమోదంతో అధ్యక్షుడు నియమిస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని