
ప్రధానాంశాలు
కుక్కునూరు, న్యూస్‌టుడే: ఎన్నికల తర్వాత పెట్టెల్లో భద్రంగా ఉండాల్సిన బ్యాలెట్ పత్రాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం బంజరగూడెం పాఠశాలలో చెల్లాచెదురుగా పడి ఉన్న బ్యాలెట్ పత్రాలను స్థానికులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. సర్పంచి, వార్డు సభ్యులకు చెందిన ఈ బ్యాలెట్ పత్రాలను పరిశీలిస్తే.. తొండిపాక పంచాయతీకి చెందిన 13వ నంబరు పోలింగ్ స్టేషన్లో 6వ బూత్‌కు సంబంధించినవిగా తేలింది. వీటిపై ఓటేసిన గుర్తులను బట్టి.. ఈ రెండూ తెదేపా మద్దతుదారులవి. ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మీకాంతం మాట్లాడుతూ బ్యాలెట్ పత్రాలు దొరకడంపై వివరాలు సేకరిస్తున్నామని, సిబ్బంది నిర్లక్ష్యమా? ఓటర్లే బయటకు తెచ్చారా? అన్నది విచారిస్తామని చెప్పారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!