
ప్రధానాంశాలు
పారిస్: కరోనా వ్యాప్తి మొదలై ఏడాది దాటినా.. మహమ్మారి వల్ల కలిగే అనోస్మియా (వాసనను పసిగట్టలేకపోవడం) సమస్యకు పరిష్కారం దొరకడం లేదని వైద్యులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మందిలో ఈ సమస్య ఆరు నెలల వరకు ఉంటోందని, మరికొందరిలో ఇది ఏడాది పాటు కొనసాగుతోందని పేర్కొన్నారు. యువతలోనే ఈ సమస్య అధికంగా ఉందని తెలిపారు. దీనివల్ల బాధితుల్లో కుంగుబాటు, బరువు తగ్గిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కొందరు ఈ సమస్య నుంచి బయటపడటం అసాధ్యమని అంటున్నారు.
గాబ్రియెల్లా సమస్య ఇలా...
గతేడాది నవంబర్లో కొవిడ్ బారినపడిన ఓ యువతి.. వైరస్ను జయించిన తర్వాత కూడా ఎలాంటి వాసనను పసిగట్టలేకపోతున్నట్లు తెలిపారు. ‘‘వాసన పసిగట్టలేకపోవడం చాలా బాధాకరం. అప్పుడప్పుడు నా నుంచి దుర్వాసన వస్తుందేమో అనుమానం కూడా వస్తుంది. ఎలాంటి వాసనను పసిగట్టలేకపోవడం వల్ల సరిగా తినక, బరువు తగ్గుతున్నా. అత్మవిశ్వాసం కోల్పోతున్నా’’ అని ఆమె వాపోయారు. గాబ్రియెల్లా సమస్యను పరిష్కరించేందుకు ఫ్రాన్స్ నీస్లోని యూనివర్సిటీ ఆఫ్ హెడ్ అండ్ నెక్ వైద్యనిపుణులు ప్రయత్నించారు. ఆమె ముక్కు కుడిభాగంలో చిన్న కెమెరాను ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని వాసనలు చూపించారు. అయినా.. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరిసారిగా చేసిన ప్రయత్నంలో ఆమె చేప వాసనను పసిగట్టినట్లు వైద్యులు తెలిపారు. వాసన పసిగట్టే గుణాన్ని ఆమె పూర్తిగా కోల్పోలేదని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్న సెసా అనే యువకుడిపైనా వైద్యులు పరీక్షలు జరిపారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు