దుఃఖాన్ని దిగమింగి.. ప్రాణానికి‘ప్రాణం’గా నిలిచి!
close

ప్రధానాంశాలు

దుఃఖాన్ని దిగమింగి.. ప్రాణానికి‘ప్రాణం’గా నిలిచి!

ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఏఎస్‌కే ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి  అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌.. గత కొన్ని రోజులుగా బాధితులకు సొంత ఖర్చులతో ఆక్సిజన్‌ సిలిండర్లను అందజేస్తున్నారు. పది రోజుల క్రితం ఆయన సతీమణి అర్షితాఖానం హఠాన్మరణం చెందారు. ఆ దుఃఖాన్ని దిగమింగుకుని.. సేవలను అందిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు. ఇప్పటి వరకు  సాజిద్‌ఖాన్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వందల మంది కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేశారు. తాను అందించిన ఆక్సిజన్‌ సిలిండర్ల సహాయంతో కోలుకున్న వారిని చూస్తుంటే ఆనందం వేస్తుందంటారు సాజిద్‌ఖాన్‌.

-ఈనాడు, ఆదిలాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని