ఉప్పలపాడులో అరుదైన అతిథులు

ప్రధానాంశాలు

ఉప్పలపాడులో అరుదైన అతిథులు

క్కడ కనిపిస్తున్నవి నీటి కుక్కలు. శాస్త్రీయ నామం లూట్రా లూట్రా. క్షీరద రకానికి చెందినవి. పెద్దగా అలికిడి లేని నీటి వనరులున్న ప్రాంతల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటి ప్రధాన ఆహారం చేపలు. ఇప్పుడు ఇవి గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో సందడి చేస్తున్నాయి. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో అడపా దడపా నీటి కుక్కలు కనిపిస్తుంటాయి. అక్కడి నుంచి కృష్ణా కాలువల ద్వారా ఉప్పలపాడు చెరువులోకి ఇవి వచ్చి ఉంటాయని అటవీశాఖ ఆధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం చెరువులో సుమారు డజను నీటి కుక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉదయం, సాయంత్రం మాత్రమే కాసేపు నీటిపైకి వచ్చి తల బయటకు పెట్టి చూస్తుంటాయి. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న నీటి కుక్కల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు.

-ఈనాడు, అమరావతి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని