ఆరోగ్య‘సాయి’

ప్రధానాంశాలు

ఆరోగ్య‘సాయి’

గురుపౌర్ణమి సందర్భంగా బెంగళూరు జేపీ నగరలోని సత్యసాయి గణపతి షిర్డీ బాబా మందిరంలో ప్రత్యేకంగా అలంకరించారు. 3 లక్షల మందు బిళ్లలు, 10 వేల మాస్క్‌లు, 2 వేల శానిటైజర్‌ సీసాలు, కొబ్బరి, పుచ్చకాయలను వినియోగించి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ అలంకరణ వారం రోజుల పాటు కొనసాగుతుంది. అనంతరం అలంకరణకు వినియోగించిన మాత్రలు, మాస్కులు, శానిటైజర్‌లను పేదలకు ఉచితంగా అందజేస్తామని ఆలయ ట్రస్టీ రామమోహనరాజ్‌ తెలిపారు. ప్రత్యేక అలంకరణను బెంగళూరు దక్షిణ నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య ప్రశంసించారు.

-న్యూస్‌టుడే, శివాజీనగర


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని