కొత్త పురపాలికల్లో పారిశుద్ధ్యం అధ్వానం

ప్రధానాంశాలు

కొత్త పురపాలికల్లో పారిశుద్ధ్యం అధ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొత్త పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. 34 కొత్త పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం, హరితహారం అమలుకు సంబంధించి నిర్వహించిన సర్వేలో అత్యధిక చోట్ల పారిశుద్ధ్యం మెరుగ్గా లేదని వెల్లడైంది. కొత్త పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం, హరితహారంలో భాగంగా పచ్చదనం పెంపు ర్యాంకులను రాష్ట్ర పురపాలక శాఖ ప్రకటించింది. మెరుగైన పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపులో పీర్జాదిగూడ పురపాలక సంఘం మొదటి ర్యాంకులో నిలవగా.. తర్వాత స్థానాల్లో కొంపల్లి, దుండిగల్‌, పోచారం, గుండ్లపోచంపల్లి ఉన్నాయి. ప్రధాన, అంతర్గత రహదారుల శుభ్రత, ఇంటింటికి చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ సహా పారిశుద్ధ్యానికి సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో లక్షెట్టిపేట, చండూరు, హాలియా, జడ్చర్ల, ఆత్మకూరు, తుక్కుగూడ సహా వివిధ పురపాలక సంఘాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రకటించిన హరితహారం ర్యాంకుల్లో శంషాబాద్‌, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్‌, నార్సింగి, కల్వకుర్తి, రాయికల్‌, నస్పూర్‌, ఆదిభట్ల చివరి స్థానాల్లో ఉన్నాయి. మిగిలినవి హరితహారం అమలు లక్ష్యంలో 80 శాతానికి పైగా ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని