రోగమొస్తే జేబు గుల్లే!

ప్రధానాంశాలు

రోగమొస్తే జేబు గుల్లే!

వైద్యానికి భారతీయుల సొంత ఖర్చు 63%
సూడాన్‌కంటే కాస్తమెరుగైన స్థితిలో భారత్‌

ఈనాడు, దిల్లీ: వైద్యం కోసం భారతీయులు సొంత జేబు నుంచి తీసి చేసే ఖర్చు 63%మేర ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. ఈ విషయంలో భారత్‌ సూడాన్‌  (66%) కంటే కాస్తమెరుగైన స్థితిలో ఉన్నట్లు ఆమె వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలిసింది. మంగళవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. తాజా గ్లోబల్‌ హెల్త్‌ ఎక్స్‌పెండిచర్‌ డేటాబేస్‌ ప్రకారం వైద్యానికి ప్రజలు సొంత జేబులోంచి చేసే వ్యయం ఫ్రాన్స్‌లో కేవలం 9% ఉందని కేంద్రమంత్రి తెలిపారు. మనదేశంలో 2013-14లో 69.1% ఉన్న ప్రజల సొంత ఖర్చు 2016-17నాటికి 5.9%మేర తగ్గి 63.2%కి చేరిందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని