అరటి గెలకు 500 కాయలు

ప్రధానాంశాలు

అరటి గెలకు 500 కాయలు

సాధారణంగా అరటి గెల 3 అడుగుల పొడవు పెరుగుతుంది. 15 పెడల వరకు కాయలు కాస్తుంది. కానీ విజయనగరం జిల్లాలోని సీతానగరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు పెంచుతున్న  3 చెట్లు నాలుగున్నర అడుగుల పొడవైన గెలలు వేశాయి. ఒక్కోదానికి 25 పెడలతో 500 చొప్పున కాయలు కాశాయి. ఈ చెట్లకు సేంద్రియ ఎరువులను వినియోగించినట్లు ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న లక్ష్మి తెలిపారు. పోషకాలు సక్రమంగా అందడంతో ఇంత పెద్ద మొత్తంలో కాయలు వేసినట్లు ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల ఆచార్యుడు డీవీజీ ప్రసాద్‌ వివరించారు.

- న్యూస్‌టుడే, సీతానగరం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని